తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలంలోని పాజర్ల గ్రామం జరిగిన ఉమ్మడి పొలువారి కుటుంబంలో జరిగిన వివాహ వేడుకకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ దివి శివరాం హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్ దివి శివరాంకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాళ్లపాడు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కాకుమాని మాధవరావు మాజీ ఎంపీపీ పొడపాటి శ్రీనివాసరావు నియోజకవర్గ మాజీ మీడియా కోఆర్డినేటర్ దివి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు