నీట్‌ పీజీ పరీక్ష సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని మోహరించి, పరీక్షార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నారు.పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పోలీసులకు మరియు పరీక్షా నిర్వాహకులకు సహకరించాలని, పరీక్షా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *