ప్రిన్సిపల్ సెక్రటరీ కు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వినతి
తొలి శుభోదయం న్యూస్ ఎర్రగొండపాలెం:-
వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులలో అర్హత ఉన్నప్పటికీ, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీ ఎలిజిబుల్ లిస్ట్‌లో పేర్లు లేని ప్రతి ఒక్కరికీ తక్షణమే న్యాయం చేయాలని ఎర్రగొండపాలెం గౌరవ శాసనసభ్యులు శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.ఈ రోజు సచివాలయంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారిని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాధితులు కలిశారు. అర్హత ఉన్నప్పటికీ లబ్ధిదారుల జాబితాలో కొందరి పేర్లు విస్మరించడంపై ప్రిన్సిపల్ సెక్రెటరీ కు నిర్వాసితులతో కలిసి ఆయన ఒక వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందాలన్నారు. సాంకేతిక కారణాలు లేదా ఇతర లోపాల వల్ల అర్హులైన లబ్ధిదారుల పేర్లు జాబితాలో లేకుండా పోయాయని, దీనివల్ల వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి, తక్షణమే సవరించిన జాబితాలో చేర్చాలని కమిషనర్‌ను కోరారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, అర్హులైన చివరి లబ్ధిదారునికి కూడా ప్యాకేజీ అందేలా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం స్వీకరించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఈ సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ అర్హులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు