google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో, నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం జరగనుంది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు… పార్టీ నేతలతో కలిసి శుక్రవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు వేలాదిగా హాజరవుతారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నాయకులకు సూచించారు. తాగునీరు, భోజన వసతులపై చర్చించారు. ర్యాలీ ప్రారంభమయ్యే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి – ఏఎంసి ప్రాంగణం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే గారు సూచించారు. ఎమ్మెల్యే గారి వెంట పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకుడు రాయపాటి శ్రీనివాసరావు, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీనివాసరావు, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *