హ్యూమన్ రైట్స్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బి యస్ నారాయణ రెడ్డి సంఘ సేవకులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు పేదల కోసం ప్రతి సోమవారం దాతల సహకారంతో ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ జి హెచ్ ఆర్ ఏ సి సి పి సి ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెలిపారు. శ్రీ శ్రీ భగవాన్ కాశినాయన ఆశ్రమాలు వందల కొద్ది ఉన్నాయి రాయలసీమలో కాశినాయన ఫోటో ఎక్కడ ఉన్నా కూడా అక్కడ అన్న వితరణ జరుగుతా ఉంటుంది అందులో భాగంగానే దాతల సహాయంతో గిద్దలూరులో ఏర్పాటు చేస్తున్నాం అలాగే 365 రోజులు ముప్పుట భోజనం కల్పించడానికి దాతలు గౌరవ పెద్దల సలహాతో ఏర్పాటు చేస్తున్నామని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. గిద్దలూరులో పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి సామాన్య ప్రజలు పెళ్లిళ్లు చేసుకునే విధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేసి సమావేశాలు ఏర్పాటు గౌరవ పెద్దల ఆర్థిక సహాయ సహకారాలతో చేస్తున్నామన్నారు ఈరోజు ఉదయం స్వామివారికి అభిషేకం పూలమాలలతో అలంకరణ నూతన వస్త్రాలు ధరించి పూజనిర్వహించారు దాత కాశినాయన పరమ భక్తుడు పేరు ఊరు వద్దన్నారు చక్కటి రుచికరమైన భోజనం పులగం, 13 రకాల ఆకుకూరలతో పచ్చడి పరమాన్నం పెరుగు ఏర్పాటు చేసినందుకు శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన అన్న వితరణ సేవాశ్రమం తరఫున దాతకు కృతజ్ఞతలు తెలిపారు 16 నెలలు పూర్తి చేసుకొని 17వ నెలలోకి దాతల సహకారంతో ముందుకెళ్తున్నామన్నారు. దాతలకు హృదయపూర్వక పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నామన్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం భోజన ఏర్పాటు కొరకు దాతలు ముందుకు రావాలని కోరారు సేవా కార్యక్రమంలో కూరకాయలు తరిగించటానికి భోజనం ఏర్పాటు చేయడానికి వడ్డించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు వందల మందికి ఏర్పాటు చేస్తున్నాం రాబోవు రోజులలో వేల మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి దాతలు సిద్ధంగా ఉన్నారని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సూపర్నెంట్ పాల్గొన్న విశ్రాంత సూపర్నెంట్ పాలుగుళ్ల కాశిరెడ్డి విశ్రాంత లెక్చరర్ వడ్డీ వీరారెడ్డి ఏలూరు రమణారెడ్డి ఎక్కడిది నరసమ్మ రోశయ్య కాశినాయన భక్తులు పాల్గొన్నారు.