పోలీస్”ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( మీకోసం) కార్యక్రమంకు 47 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం మార్కాపురం జిల్లా పోలీసు కార్యాలయంలో “మీకోసం” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ గారు, పోలీసు అధికారులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.ప్రత్యేకంగా వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే విచారణ చేపట్టి, చట్ట ప్రకారం విచారణ చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్,ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వాటిపై సమగ్ర విచారణ చేపట్టి చట్టపరిధిలో సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సన్, వై.పాలెం సీఐ కె.అజయ్ కుమార్,కనిగిరి సీఐ శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.