2025-26 విద్యా సంవత్సరంలో దర్శి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన 24 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసే కార్యక్రమం దర్శి పట్టణంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి టిడిపి ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ గారు విద్యార్థులను అభినందిస్తూ, విద్యే జీవితంలో శాశ్వత సంపద అని పేర్కొన్నారు.
🔹 ప్రథమ బహుమతి – రూ.10,000
🔹 ద్వితీయ బహుమతి – రూ.5,000 కీ.శే. కొండేటి నరసింహులు – శ్రీమతి రోశమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, సినీ నిర్మాత కొండేటి చిన్న నరసింహారావు గారు ఈ బహుమతులను అందజేయడం అభినందనీయమని డా. లక్ష్మీ గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
✅ మన జీవితంలో చేసే అత్యుత్తమ పెట్టుబడి విద్య.
✅ విద్యకు మించిన సంపద మరొకటి లేదు.
✅ పేద విద్యార్థుల్లో అపార ప్రతిభ దాగి ఉంది.
✅ ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి విజయాన్ని సాధించాలి.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *