ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో మొత్తం 16 హై-రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కెమెరాల ద్వారా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో జరిగే బ్యాగుల దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీలు, మొబైల్ ఫోన్ చోరీలు తదితర నేరాలను వేగంగా గుర్తించి, నిందితులను గుర్తించడంతో పాటు దొంగిలించబడిన వస్తువులను రికవరీ చేయడంలో ఎంతో ఉపయోగపడతాయన్నారు.ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరాల ఛేదనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరా వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలు గుర్తించిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మార్కాపురంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపిన మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుసేన్, మార్కాపురం ఎస్‌ఐలను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *