వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
మాజీ ముఖ్యమంత్రివర్యులు సంక్షేమ రథసారథి, జలయజ్ఞ సృష్టికర్త,పేదల పాలిట పెన్నిధి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని కందుకూరు పట్టణములోని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర వైయస్సార్ పార్టీ శ్రేణులు సమక్షంలో జరిగిన జయంతి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ. మహానేత వైయస్సార్ ను నేటికీ మరువజాలం అని ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. జలయజ్ఞం పేరుతో భారీ ప్రాజెక్టుల నిర్మించి రాష్ట్ర రైతాంగాని ఆదుకున్న మహానుభావుడు ఉచిత కరెంటు అందించి వ్యవసాయాన్ని పండగ చేసిన మహానేత, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తోటి చదువులను అందించి విదేశాలకు ఉద్యోగరీత్యా పంపించిన ఘనుడు వైఎస్సార్ అని కొనియాడారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వైఎస్ఆర్ సేవలు మరువలేనివని అన్నారు. కందుకూరు నియోజకవర్గ దాహార్తిని తీర్చిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంత ప్రజలు సదా స్మరించుకుంటూ నే ఉంటారని తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు వింటేనే సంక్షేమం అభివృద్ధి పరుగులు తీస్తుందని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాలని ప్రతి పౌరుడికి ఓటు కల్పించే విధంగా చేయాలని అన్నారు.జయంతి కార్యక్రమాలను గ్రామాల్లో, పట్టణాల్లో,మండల కేంద్రాల్లో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి స్వర్ణ యుగ పరిపాలనలో ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ, పేద వర్గ ప్రజలు, మహిళలు సాధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని తెలియజేశారు. ముందుగా మహానేత విగ్రహానికి గజమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 77 కేజీల భారీ కేకులు కట్ చేసి జయంతి నివాళులర్పిస్తూ మిఠాయిలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ,వలేటివారిపాలెం మండల అధ్యక్షులు అనుమోలు లక్ష్మీనరసింహం,జిల్లా సెక్రెటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ జాయింట్ సెక్రెటరీ గణేశం గంగిరెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి బద్దిపూడి జయరావు,జిల్లా ఇంటలెక్చువల్ అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం,జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు కట్టా హనుమంతరావు, ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ గేరా మనోహర్, జిల్లా జాయింట్ సెక్రెటరీ చీమల రాజా, జిల్లా సెక్రెటరీ పాశం కొండయ్య, జిల్లా మున్సిపల్ వింగ్ సెక్రెటరీ నగల్ల నారయ్య, రాష్ట్ర ప్రచార సంఘం అధికార ప్రతినిధి వల్లూరి.కోటేశ్వరరావు , నియోజకవర్గం గ్రీవెన్స్ అధ్యక్షులు యరమాల నాగభూషణం,రైతు ప్రతినిధులు ఉప్పుటూరి నాగేశ్వరరావు, వాకా శ్రీనివాస్ రెడ్డి, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, షేక్ రహీం, మందలపు మహేష్, పల్నాటి చెన్నయ్య, గల్లా వెంకటేశ్వర్లు, పేయ్యల రమణయ్య, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తుళ్లూరి ఆదిలక్ష్మి, నియోజకవర్గ అంగన్వాడి విభాగం అధ్యక్షులు దేవరకొండ ఆదిలక్ష్మి, పట్టణ అధ్యక్షురాలు కొత్తగొర్ల వసంతలక్ష్మి, మాజీ కౌన్సిలర్ కరీమునిషా, ఆదామ్ బీబీ, తన్నీరు ధరణి తదితరులు పాల్గొన్నారు.