ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ‘స్కై ఐ ప్రకాశం’ (Sky Eye Prakasam Project) ప్రాజెక్టు ద్వారా కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామం మరియు బల్లికురవ పరిధిలోని అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ నిఘా నిర్వహించారు.ఈ డ్రోన్ పర్యవేక్షణ ద్వారా అనుమానాస్పద కదలికలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, జూదం, మద్యం సేవించడం, మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు మరియు ఇతర నేరాలను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం, శాంతి భద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా స్కై ఐ ప్రకాశం ప్రాజెక్టు ద్వారా డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *