తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా పోలీసులు బాలికలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలలపై జరిగే నేరాలు, బాలల దుర్వినియోగం (Child Abuse), సైబర్ మోసాలు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు.అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ తమ భద్రత విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాలను సమర్థవంతంగా నిరోధించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.