తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :-
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా జరుగుమల్లి మండల కేంద్రంలో ఉన్న డా॥ వై.ఎస్.ఆర్ గారి విగ్రహానికి,పూలమాలలతో , వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు.సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను ఈ సందర్భంగా , పార్టీ నేతలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పిఎసి సభ్యులు కొండపి నియోజకవర్గం వైసిపి ఇన్చార్జ్ డా॥ ఆదిమూలపు సురేష్ గారు జరుగుమల్లి మండల పార్టీ అధ్యక్షులు పిన్నిక శ్రీనివాసరావు గారు, వైఎస్సార్సీపీ జరుగుమల్లి మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.