మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థుల రవాణా బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.కంభం పట్టణంలోని గౌతమ్ విద్యాసంస్థల ప్రాంగణంలో విద్యార్థుల రవాణాకు వినియోగిస్తున్న బస్సులను పరిశీలించి, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బీమా, పర్మిట్ తదితర పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే బస్సుల సాంకేతిక పరిస్థితి, భద్రతా ప్రమాణాలను పరిశీలించి విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేశారు.అదేవిధంగా మార్కాపురం రూరల్ పోలీసులు, మోటారు వాహన శాఖ (MVI) అధికారులతో కలిసి మొత్తం 71 పాఠశాల, కళాశాల బస్సులను తనిఖీ చేసి, వాహనాల ఫిట్‌నెస్, పత్రాల చెల్లుబాటు, అత్యవసర భద్రతా పరికరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల పనితీరును పరిశీలించారు.వై.పాలెం పట్టణంలో కూడా పాఠశాల బస్సులను తనిఖీ చేసి, అన్ని పత్రాలు, ఫిట్‌నెస్ ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, విద్యార్థులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, బస్సులు ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేలా నిర్వహించాలని అధికారులు సూచించారు.విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని, సురక్షితమైన విద్యార్థుల రవాణా కోసం అన్ని విద్యాసంస్థలు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *