google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు గిద్దలూరు అర్బన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్లు 198, 201 మరియు 202లను సందర్శించి, ప్రస్తుతం జరుగుతున్న Special Intensive Revision (SIR) కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారుల (BLOలు) ద్వారా చేపడుతున్న ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ధృవీకరణ, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణ, అవసరమైన దరఖాస్తుల స్వీకరణ తదితర ప్రక్రియలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి, కార్యక్రమం నిబంధనల ప్రకారం పారదర్శకంగా, సమయపాలనతో నిర్వహించాలని అధికారులకు సూచించారు.ప్రజలకు SIR కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ తనిఖీలలో సంబంధిత ఎన్నికల అధికారులు, గిద్దలూరు మండల తహశీల్దార్ ఎం ఆంజనేయ రెడ్డి,, గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈవి రమణ బాబు,, సూపర్వైజర్లు మరియు బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed