google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు యుటిఎఫ్ కార్యాలయం నందు ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కుల వివక్ష పైసామాజికశంఖారావంసమావేశం జరిగింది. ఈ సమావేశం కుడప్పుకళాకారుల సంఘం జిల్లా కార్యదర్శి వై సింగరయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశం లో రైతు సంఘం జిల్లా నాయకులు డి సోమయ్య పాల్గొని మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజం కోసం నిర్వహిస్తున్న సామాజికశంఖారావాన్నిజయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీ నుండి 26వ తారీకు వరకు జిల్లాలో ఉన్న అన్ని దళిత గ్రామాలలో, పేటలలో, కాలనీలలోప్రజాసంఘాలనాయకులు పర్యటన చేసి సమస్యలు అధ్యయనం చేసి వాటిపై పోరాటం చేయాలని అన్నారు. సిఐటియు మార్కాపురం జిల్లా అధ్యక్షులు టీ ఆవులయ్య మాట్లాడుతూ కొమరోలు మండలం బెడుసు పల్లె గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఐదు దళిత కుటుంబాలు అక్కడున్నటువంటి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటుంటే కొంతమంది ఆ వూరు పెత్తందారులు ఆ భూమిలోకి పోనీయకుండా దళితులను అడ్డుకుంటున్నారని భూమిని దున్నుకునేందుకు ట్రాక్టర్లను కూడా పోనివ్వకుండా చేస్తున్నారని అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed