తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు తాళ్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలు మరియు చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, మహిళలపై నేరాల నివారణ, బాల్య వివాహాల నిషేధం, సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, OTP మోసాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, చైన్ స్నాచింగ్ నివారణ మరియు ఇతర నేరాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరస్థులు ఫోన్ కాల్స్, సందేశాలు, నకిలీ లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలు, బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని వివరించారు.అవగాహన కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ కూడా నిర్వహించి, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు.