తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య సోదరుడు ఆదాము ఇటీవల చనిపోగా…. కందుకూరులోని ఆదిఆంధ్ర కాలనీలో శనివారం ఆదరణ కూడిక నిర్వహించారు.కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరై, ఆదాముకు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో చదలవాడ కొండయ్యతో పాటు ఎస్సీ నాయకులు రాయపాటి శ్రీనివాసరావు, రెబ్బవరపు మాల్యాద్రి, మెండా లెనిన్, బద్దిపూడి శిఖామణి, చింతల సింగయ్య తదితరులు పాల్గొన్నారు.