తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని మానసిక వికలాంగుల కేంద్రం మరియు సంజీవిని వృద్ధ మరియు అనాధ ఆశ్రమంలో యాచకులకు దుప్పట్లు, ఆహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కీర్తిశేషులు చిలక బాలనాగయ్య, జ్ఞాపకార్థం ఆయన సతీమణి సుబ్బలక్ష్మమ్మ వారి కుమారుడు శివశంకర్ కోడలు లలిత, కూతుర్లు భవాని, నవీన ఆధ్వర్యంలో ఈ దాతృత్వం కార్యక్రమం జరిగింది. సంజీవిని వృద్ధ అనాధ ఆశ్రమం తో పాటు మానసిక వికలాంగుల కేంద్రంలో ఆహారం, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాతలకు ఆశ్రమం మానసిక వికలాంగుల కేంద్రం నిరూపకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సోషల్ సర్వీస్ సంస్థ సభ్యులు ఏబీఎన్ రిపోర్టర్ తోట శీను టీవీ9 రసూల్ బిగ్ టివి శశి కుమార్ రెడ్డి వినుకొండ చిట్టిబాబు పాల్గొన్నారు.