తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో డా గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత సమాజం, ఆరోగ్యకరమైన పరిసరాల కోసం ప్రజల సహకారంతో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, మొక్కలు పెంచే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యువనేత డా కడియాల లలిత్ సాగర్ గారు , ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.