టీ.ఆర్.ఆర్.ప్రభుత్వ అటానమస్ డిగ్రీ కళాశాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ఉదారంగా ముందుకు వచ్చిన విర్చో ఫౌండేషన్, హైదరాబాద్, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ ఎం. నారాయణ రెడ్డి గారికి టి.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), కందుకూరు తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తోంది.నారాయణ రెడ్డి కళాశాలకు అత్యాధునిక AI టూల్స్ లతో కూడిన 3 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (IFPs) మరియు 4 LED ప్రొజెక్టర్లను – సుమారు రూ.7లక్షల విలువ చేసేవి – CSR ప్రాజెక్టు కింద విరాళంగా అందించారు.ఉన్నత విద్యలో AI టూల్స్ వల్ల బోధన-అభ్యసన ప్రక్రియ మెరుగుపడి, విద్యార్థులకు అనుగుణంగా పాఠాలు రూపొందించడం, ఉపాధ్యాయుల సమయం ఆదా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లోని కష్టమైన అంశాలను 3D వర్చువల్ ల్యాబ్స్ ద్వారా సులభంగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.విర్చో ఫౌండేషన్ నుండి ఈ అమూల్యమైన సహాయం అందడానికి మన కళాశాల పూర్వ విద్యార్థి, శ్రీ ఇప్పగుంట మల్లికార్జున రావు గారి శిష్యుడయిన, శ్రీ కొండేపి శ్రీరామచంద్రరావు గారి కృషి ఎంతో ఉంది.గత సంవత్సరం కూడా విర్చో ఫౌండేషన్, హైదరాబాద్ వారు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం రూ. 11,00,000/- విలువైన 15 HP డెస్క్‌టాప్ కంప్యూటర్లు మరియు UPS వ్యవస్థను కళాశాలకు విరాళంగా అందించారు.విద్యారంగానికి నిరంతరం అందిస్తున్న సహకారానికి, ఉదారంగా ముందుకు వచ్చి కళాశాలకు సహాయం అందించిన శ్రీ ఎం. నారాయణ రెడ్డి గారికి కళాశాల యాజమాన్యం, సిబ్బంది మరియు విద్యార్థులు తమ ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *