కందుకూరు డిజైన్ వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ స్థాపించి సంవత్సరం అయినా సందర్భంగా శ్రీ దాచురి రామిరెడ్డి విజ్ఞాన భవన్ నందు యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు ఎస్.కె గఫూర్ గారు అధ్యక్షత వహించారు కార్యదర్శి ఎస్కే సుభాని కోశాధికారి పఠాన్ మున్నా ఖాన్ ఉపాధ్యక్షులు ఎస్కే చానా చలువాది శ్రీను సహాయ కార్యదర్శులు ఎస్కే రసూల్ అల్తాఫ్ గౌరవ సభ్యులు ఎస్కే జిల్లాని ఎస్కే నూరు మహాభాష పాల్గొన్నారు అధ్యక్షులు గఫూరు మాట్లాడుతూ కందుకూరు పట్టణంలో డిజైన్ వెల్డింగ్ కార్మికులకు ఆటోనగర్ లో స్థలాలు కేటాయించాలని షాపుల నిర్మాణం చేపట్టాలని అర్హత కలిగిన వారికి స్కిల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని శ్రీ గౌరవనీయులైన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరావు గారికి కందుకూరు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలని ప్రతి వాదించగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించటం జరిగింది అనంతరం సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వగా సబ్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తన పరిధిలోని సమస్యల్ని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఏ గౌస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *