ప్రకాశం జిల్లా జూనియర్ కళాశాలల విభాగంలో సైనింగ్ స్టార్ అవార్డులకి ఎంపికైన ముగ్గురు TRR ప్రభుత్వ జూనియర్ కళాశాల కందుకూరు విద్యార్థులు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న కళాశాల HEC విద్యార్థులు పి. మధులత, sd. పర్వేజ్,MPHW విద్యార్థిని పి. వెన్నెల, లకు జూనియర్ కళాశాలల విభాగంలో షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపిక కావడం గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఆర్ లావణ్య లత గారు అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు కింద 20 వేల రూపాయల నగదు ప్రశంసా పత్రము ఒంగోలు నందు జిల్లా ఇన్చార్జి మంత్రి జిల్లా అధికారుల చేతుల మీదుగా అందుకోనున్నట్లు తెలియజేశారు. హెచ్ఎసి, నర్సింగ్ విద్యార్థులకు అవార్డు రావడం పట్ల హిస్టరీ అధ్యాపకులు కట్ట సుబ్బారావు గారు, నర్సింగ్ అధ్యాపకులు చాముండేశ్వరి, మేరీ గ్రేస్ లో ఆనందము వ్యక్తపరిచి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కళాశాల అధ్యాపకులు ఓరుగంటి వెంకటేశ్వరరావు,ఖాదర్వలీ, చుండూరి బాబురావు, బొప్పరాజు వెంకట కాశిరత్నం,హాజరతయ్య, మాధవరావు, సీతారావమ్మ, శివకుమారి,మాధవిలక్ష్మీ, రాజు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియజేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *