తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
తూర్పు చౌటపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడీలోని వసతులు, పౌష్టికాహారాన్ని పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి ఆరోగ్య సూత్రాలను విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.