ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో టంగుటూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులు హాజరై ప్రముఖ సంస్థల ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ రవికుమార్ మాట్లాడుతూ, యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా లభించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని స్వయం ఉపాధి లేదా ఉద్యోగాలను పొందేందుకు ముందుకు రావాలని అన్నారు.టంగుటూరు తహసీల్దార్ (MRO) గారు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న ఉపాధి కార్యక్రమాలను నిరుద్యోగ యువత తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.టంగుటూరు ఎంపీడీఓ దేవసేన కుమారి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.మాజీ సర్పంచ్ శ్రీ జయంత్ గారు, మాజి సర్పంచ్ మమత, మాజీ ఎంపీపీ శ్రీ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర యువజన కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రభుత్వం మరియు APSSDC అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించాయి. కార్యక్రమంలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఈ జాబ్ మేళా కీలక వేదికగా నిలిచింది.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంస్థల ప్రతినిధులు, నిరుద్యోగ యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమంలో 13 కంపెనీలు పాల్గొనగా 189 మంది హాజరవ్వగా 85 మంది సెలెక్ట్ అయ్యారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *