స్థానిక టీఆర్ఆర్ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో శనివారం నాడు కళాశాల జాతీయ సేవా పథకం (NSS) విభాగాలు మరియు కామర్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో, కళాశాలలోని అన్ని ఇతర విభాగాల సమన్వయంతో “స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం” పురస్కరించుకుని ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ అధ్యక్షత విద్యార్థులను ఉద్దేశించి,. పరిశుభ్రత అనేది కేవలం ఒక రోజుతో ముగిసిపోయేది కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ లక్ష్యాలను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని, విద్యార్థులు తమ ఇళ్లతో పాటు, కళాశాల ప్రాంగణాన్ని మరియు సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచడంలో అగ్రభాగాన నిలవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్.వి. శ్రీహరి, ఇంగ్లీష్ ఉపన్యాసకులు మరియు ఐక్యూఏసీ (IQAC) కో-ఆర్డినేటర్ డాక్టర్ పి. రాజగోపాల బాబు, పొలిటికల్ సైన్స్ ఉపన్యాసకులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్-1 కోఆర్డినేటర్ కోటపాటి నరేష్ రాజా, కెమిస్ట్రీ ఉపన్యాసకురాలు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్-2 కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వి. పద్మావతి, కామర్స్ ఉపన్యాసకులు డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, బోటనీ ఉపన్యాసకులు డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి లతో పాటు కళాశాలలోని బోధన, బోధనేతర సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రధాన ద్వారం నుండి విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ర్యాలీ నిర్వహించారు.పరిశుభ్రతపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ, “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర”, “పరిశుభ్రతను పాటిద్దాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ అనంతరం కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున శ్రమదానం చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి, కళాశాల క్యాంపస్ లోని మియావాకీ అడవిలోని కలుపు మొక్కలను తొలగించారు. మొక్కల పాదులను శుభ్రం చేసి, నీరు సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్లు కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, తోటి అధ్యాపకులకు మరియు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థి లోకానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *