మార్కాపురం జిల్లా: ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) విజ్ఞప్తి మేరకు, అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సర్క్యులర్ జారీ చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన అక్రిడిటేషన్ జర్నలిస్టుల పిల్లలకు ఈ రాయితీ అమలు చేయాలని జిల్లాలోని అన్ని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలను కలెక్టర్ ఆదేశించారు. దీంతో గుర్తింపు పొందిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
అదేవిధంగా, జిల్లా కలెక్టర్ అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేసి అర్హులైన జర్నలిస్టులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ యూడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎన్.వి. రమణ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *