తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
Indosol కంపెనీ వారు రూ.1,80,000/- విలువైన Drone ను ulavapadu పోలీస్ స్టేషన్ కు కందుకూరు SDPO గారి చేతుల మీదుగా ఉలవపాడు సబ్ ఇన్స్పెక్టర్ గారికి sdpo, కందుకూరు ఆఫీసు నందు indosol DGM Ranga Reddy గారు,
PRO Lakshminath Reddy గారు అందజేశారు. డ్రోన్ ద్వారా
బహిరంగ ప్రదేశాల్లో పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే డ్రోన్ ద్వారా నిఘా పెట్టి అరికట్టవచ్చని,
తిరునాళ్ళు, ఉత్సవాలలో వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టవచ్చని,
జాతీయ రహదారి మీద ట్రాఫిక్ చిక్కులు తప్పించవచ్చని, ఇంకా పలు ఉపయోగాలు ఉన్నాయని కందుకూరు SDPO గారు తెలిపారు.
డ్రోన్ సుమారు 5 కిలోమీటర్ల పాటు కవర్ చేస్తుందని తెలియజేయడమైంది. దూరం నుంచి వీడియోలు, ఫొటోలు తీయవచ్చని, అడవులలో, దట్టమైన చెట్ల మధ్య మనుషుల కదలికలు గుర్తించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్వర్ భాషా గారు, సబ్ డివిజన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.