తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకురాగా, ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ప్రజల నుండి 86 అర్జీలను స్వీకరించడం జరిగినది. ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని పేర్కొంటూ, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూనే, రాష్ట్ర అభివృద్ధికి అనేక కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కారమయ్యేలా సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి, ప్రతి వినతిపత్రంపై సానుకూల చర్యలు తీసుకుంటామని శాసనసభ్యులు వారు స్పష్టం చేశారు.