తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
ఉలవపాడు మండలం కరేడు పంచాయితీ టెంకాయచెట్లపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కారుమంచి పెనుగొండయ్య.. తీవ్ర అనారోగ్యంతో ఒంగోలులోని ఆస్టర్ రమేష్ (సంఘమిత్ర) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, మంగళవారం ఆసుపత్రికి వెళ్లి పెనుగొండయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడారు. పెనుగొండయ్య త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గారి వెంట టిడిపి నాయకులు వాయిల బాలమురళి, కోమట్ల రామిరెడ్డి ఉన్నారు.