తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామము నందు గతములో చేసిన రీ సర్వే నందు జరిగిన పొరపాట్లు కారణంగా ప్రస్తుతము మరలా రీసర్వే జరిపి పూర్తి స్థాయిలో సమస్యలు లేకుండా చేయుట కొరకు గౌరవ తహసీల్దారు సింగరాయకొండ వారి అధ్యక్షతన మంగళవారం కలికివాయి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడమైనది.
ఈ గ్రామ సభ నందు చర్చించిన అంశాలు.
ప్రతి సర్వే క్షేత్రమునకు సంబంధించిన పట్టదారులు అందరికి ముందస్తుగా తెలియపరచి, వారందరి సమక్షంలో గ్రామ సర్వే టీమ్ వారు రికార్డులు దాఖలా భూములు పరిశీలించి కొలతలు వేసి విస్తీర్ణము వ్యత్యాములు, క్లాసిఫికేషన్ మార్పులు, పట్టాదారు పేర్లు నందు తప్పులు, సర్వే నెంబర్ తప్పులు మరియు షేప్ ఫైల్ తప్పులు ఇవన్నీ సరి చేసి సమస్యలు లేకుండా చేయుటకు వీలు అగును అని కావున కలికివాయి లో భూములు గల పట్టాదారులు అందరూ కూడా ఈ సర్వే కి సహకరించవలసినదిగా గ్రామ సభ ద్వారా వారికి తెలుపడమైనది.