మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓపెన్ బూజింగ్‌కు ఉపయోగపడుతున్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ గ్లాసులు, చెత్త మరియు ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. అలాగే ఆయా ప్రాంతాల్లో పోలీసు నిఘాను మరింత పెంచి, బహిరంగ మద్యపానం, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల సహకారంతో నేరరహిత, పరిశుభ్రమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. బహిరంగ మద్యపానం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *