కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల అంశంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలను ఖండిస్తున్నాను అని మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రి ఒక ప్రకటనలో తెలిపారు.కందుకూరు మున్సిపాలిటీలో గ్రామాల విలీనంపై హైకోర్టులో ఉన్న పిటీషన్ పై రాజీ చేసుకోమని ఎమ్మెల్యే టిడిపి నాయకుడిని నా దగ్గరకు పంపింది వాస్తవమేనని కానీ ఆయనకు నేను చెప్పిన విషయాలను వక్రీకరించి చెప్పారు. మీ పార్టీ తరపున మీరు వచ్చి మాట్లాడారు, నేను కూడా మా పార్టీ పెద్దలతో మాట్లాడాలి అని మాత్రమే అన్నాను. దానిని వక్రీకరించి ‘..మా పెద్దాయన చెబితే చేస్తాను..’ అన్నట్లు చెప్పడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు అని అన్నారు. ఏ ప్రయోజనం ఆశించే ఎమ్మెల్యే వాస్తవాన్ని వక్రీకరించి చెప్పారని స్పష్టం అవుతుంది. గ్రామాలు ఉంటే కందుకూరు మున్సిపాలిటీ టిడిపి కైవసం అవుతుందనే దురుద్దేశంతోనే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఎమ్మెల్యే చెబుతున్నారు. అసలు దురుద్దేశం ఎవరిది.? టిడిపి ది కాదా..?
కందుకూరు పట్టణానికి ఎంతో దూరంలో ఉన్న గనిగుంట, చుట్టుగుంట, ఆనందాపురం, శామీరపాలెం తదితర గ్రామాలను 1987లో మున్సిపాలిటీలో కలిపింది అప్పట్లో టిడిపి కైవసం చేసుకోవడం కోసమే అన్నది నిజం కాదా.? ఆ గ్రామాలను కలపకపోతే మున్సిపాలిటీలో గెలవడం అసాధ్యం అన్న సంగతి స్పష్టంగా అప్పటి టిడిపి నాయకులకు తెలుసు కాబట్టే ఆ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. అప్పుడు రాష్ట్రంలో పాలన చేస్తున్నది కూడా టిడిపి ప్రభుత్వమే అన్న విషయం గుర్తుంచుకోవాలి.మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 40 ఏళ్ళు అవుతున్నా కూడా విలీనమైన గ్రామాలు గ్రామాలుగానే ఉన్నాయి కానీ అర్బన్ వాతావరణం ఏమాత్రం లేని విషయం నిజం కాదా.? గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఆ గ్రామాల్లోని ఎంతోమంది పేదలు ఉపాధి హామీ పనులను పోగొట్టుకుంది నిజం కాదా.? పేదల బతుకు తెరువుకు అండగా ఉండే ఉపాధి హామీ పనులను వారికి దక్కకుండా చేసిన పాపం టిడిపి నాయకులది కాదా.?* గ్రామాల విలీనం వలన పట్టణాభివృద్ధికి ఖర్చు చేయాల్సిన మున్సిపాలిటీ నిధులు గ్రామాలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నిజం కాదా.? అని ప్రశ్నిస్తున్నాను. వాస్తవాలన్నీ ఎమ్మెల్యే గారికి తెలిసి కూడా స్వార్ధ రాజకీయ ప్రయోజనం కోసం ఉన్న నిజాలను వక్రీకరించి ఇంటర్వ్యూలో చెప్పడం సమంజసం కాదు. వాస్తవాలను వక్రీకరించి చెప్పినా విజ్ఞత కలిగిన కందుకూరు ప్రజలకు అన్ని నిజాలు తెలుసు. వారిని ఎవరు మభ్యపెట్టలేరని అని అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *