తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐ.పి.ఎస్., గారి ఆదేశాల మేరకు, మార్కాపురం DSP నాగరాజు గారి పర్యవేక్షణలో, మార్కాపురం CI Md. ఖాజా అల్తాఫ్ హుస్సేన్ గారు, మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ SI P. విశ్వనాధ రెడ్డి మరియు వారి సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం మార్కాపురం టౌన్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వారి వివరాలు పరిశీలించి ప్రశ్నించడం జరిగింది. అలాగే అనుమానాస్పదంగా సంచరిస్తున్న వాహనాలను తనిఖీ చేసి, వాటికి సంబంధించిన పత్రాలను పరిశీలించడం జరిగింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రత పరిరక్షణ లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించబడ్డాయి. నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై నిఘా, మరియు ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడానికి ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని మార్కాపురం టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్ గారు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు ప్రజలు, యువత పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసైతే వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా ఓటీపీలు, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఆధార్ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. అదే విధంగా మహిళా చట్టాలపై మరియు కొత్త చట్టాలు, శిక్షలుపై అవగాహన కల్పించారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ గారు హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.