రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రీడా వికాస కేంద్రం (ఇండోర్ స్టేడియం) మరియు క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పనులను దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, యువనేత డా కడియాల లలిత్ సాగర్ గారు , శాప్ చైర్మన్ రవి నాయుడు గారుతో కలిసి పర్యవేక్షించారు.దర్శి పట్టణ ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ఇండోర్ స్టేడియం త్వరలో అందుబాటులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ క్రీడా ప్రాంగణం ఒక గొప్ప వేదికగా నిలవనుంది.యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం ద్వారా వారి శారీరక, మానసిక వికాసానికి తోడ్పడటంతో పాటు, దర్శి నియోజకవర్గాన్ని క్రీడా రంగంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్య, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, క్రీడా మంత్రి శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారు, శాప్ చైర్మన్ శ్రీ రవి నాయుడు గారి సహకారంతో ఈ క్రీడా ప్రాంగణం అభివృద్ధి చెందడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు తెలిపారు.గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకెళ్లి, దర్శి నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.అనంతరం శివరాజ్ నగర్‌లోని క్రికెట్ గ్రౌండ్‌ను కూడా సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు.క్రీడలకు ప్రోత్సాహం… యువతకు బంగారు భవిష్యత్తు…
దర్శి అభివృద్ధే లక్ష్యం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *