మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని సూర్య విద్యానికేతన్ ఆవరణమునందు మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిధులుగా మానవతా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విశ్రాంత ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. గౌరవ డాక్టరేట్ పొందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారిని రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరము రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నారాయణరెడ్డి లాంటి నిస్వార్థ సేవకులు అరుదుగా ఉంటారని అలాంటి మానవత్వం కలిగిన వ్యక్తులను సన్మానించటము మా బాధ్యత అని తెలిపారు.అనంతరం బి యస్ నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనంతమైన సేవలు అందిస్తున్న మానవతా సంస్థ వ్యవస్థాపకులు చేతుల మీదుగా అమెంటో శాలువాతో సన్మానం పొందడం ఆనందించదగ్గ విషయమని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా అవార్డ్స్ పొందిన ఇంత గొప్ప మహనీయులు మహానుభావులు రామచంద్రారెడ్డి చేతుల మీదుగా సన్మానం పొందడం చాలా చాలా అవధులు లేని ఆనందం కలిగిందన్నారు. మరియు గిద్దలూరు లో పనిచేస్తున్న మానవతా సభ్యులు ప్రతి ఒక్కరికి వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సార్ కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపిన బి యస్ నారాయణరెడ్డి. మానవత
ఛైర్మెన్ పాలుగుల్ల శివారెడ్డి
గిద్దలూరు అధ్యక్షులు సూర్య స్కూల్ అధినేత డి బ్రహ్మానందరెడ్డి మానవత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *