దొనకొండ మండలంలో ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , యువనేత డ్ కడియాల లలిత్ సాగర్ గార్లతో కలిసి పలు చెరువులను సందర్శించి, రుద్రసముద్రం చెరువు పూడికతీత పనులను పరిశీలించడం జరిగింది.గుండ్లకమ్మ మిగులు జలాలను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు మళ్లించడం, 40 చెరువులను అభివృద్ధి చేయడం, భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా దొనకొండలో తాగు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నాం.ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ, కరువు వలసలు లేని సస్యశ్యామల దొనకొండను నిర్మించడమే మా లక్ష్యం.చుట్టుపక్కల ఉన్న కాలువల నుంచి చెరువులను నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా చెరువుల్లోని పూడికను తొలగించి, ఆ మట్టిని తమ పొలాల్లో వినియోగించుకోవడం ద్వారా భూసారం, పంట దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు.గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి విజ్ఞప్తితో దొనకొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు, ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *