కనిగిరి మున్సిపాలిటీకి చెందిన సయ్యద్ తౌషిక్ సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో 2026 ఫిబ్రవరి 14న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం అందరికి విధితమే..తౌషిక్ తల్లిదండ్రులైన సయ్యద్ అలీ, సయ్యద్ మౌలాబీ లను కనిగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఈ సందర్భంగా వారు తమ బాబు మృతి చెంది 5 నెలలు గడిచినప్పటికి మాకు కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు తగిన న్యాయం జరగలేదని, మృతికి కారకులైన వారిని గుర్తించడంలో జాప్యం చేస్తున్నారని వైఎస్ జగన్ గారికి తమ గోడును వెల్లడించారు.వారి బాధను విన్న మాజీ వైఎస్ జగన్ మెహన్ రెడ్డి గారు తౌషిక్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి వారిని ఓదార్చారు.పార్టీ తరుపున మీకు అండగా లీగల్ సపోర్ట్ అందిస్తామని భరోసా ఇచ్చారు.దీనిపై పూర్తి విచారణ చేపట్టి హైకోర్టులో కేసు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైస్సార్సీపీ) లీగల్ సె ల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. మనోహర్ రెడ్డి గారికి సూచించారు.పూర్తి డేటా సేకరించిన అనంతరం సయ్యద్ అలీ, సయ్యద్ మౌలాబీ లను మళ్ళీ తీసుకొని రావాలని వైఎస్ జగన్ గారు దద్దాల నారాయణ యాదవ్ గారికి చెప్పినట్లు తెలిపారు.తమకు ఈ అవకాశం కల్పించినందుకు ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *