గురువారం స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పెన్డౌన్ కార్యక్రమం చేపట్టిన దస్తావేజు లేఖర్లును శిబిరంలో పాల్గొని సంఘీభావం తెలిపిన కందుకూరు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇటీవల జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 396 ప్రవేశ పెట్టడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పి పి పి విధానం ద్వారా నిర్వహించుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ సంస్థలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇవ్వడం వలన అనేక భూములు ఒకరికి తెలియకుండా ఒకరీ మీద ఆన్లైన్ చేసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు గా పెద్దపెద్ద కార్పోరేట్ సంస్థలకు పి పి పి విధానం ద్వారా అప్పగించడం వలన రిజిస్ట్రేషన్ కార్యాలయం నమ్ముకొని గత కొంతకాలంగా పనిచేస్తున్న దస్తావేజర్లు, స్టాంపు వండర్లు, డిటిపి చేసే వర్కర్లు, ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్ కార్యాలయం నమ్ముకొని జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ప్రభుత్వం వెంటనే రిజిస్టర్ కార్యాలయాలు ప్రైవేట్ పరం చేసే విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వై ఆనంద్ మోహన్, సిహెచ్ దుర్గాప్రసాద్, చిన్న బ్రహ్మయ్య, దస్తావేజర్, లో పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *