తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గొర్రె సుబ్బారెడ్డి గారు ఇటీవల కాలు శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు గురువారం కొత్తపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు గారు, కొత్తపల్లి గ్రామ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.