తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్ల కడుపు కొట్టి,పి.పి.పి విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దోపిడీకి ద్వారాలు తెరవడమేనని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు అన్నారు.
రిజిస్ట్రార్,సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధుల్లో డాక్యుమెంట్ రైటర్ల జీవితాల్లో అశనిపాతంలా సేవా కేంద్రాలు ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకొని జీవో విడుదల చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పెల్లుబికింది.
డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిరసన చేస్తున్నారు.
మార్కాపురంలో గురువారం అన్నా రాంబాబు డాక్యుమెంట్ రైటర్లకు సంఘీభావం ప్రకటించి,వారి నిరసన శిబిరంలో మాట్లాడారు.
వైద్యం,విద్య వంటి సేవల దగ్గర నుంచి ప్రతిదీ ప్రయివేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తెగ ఆరాటపడుతుందని,చివరకు తమ ప్రభుత్వాన్ని కూడా పి.పి.పి విధానంలో ఏర్పాటు చేస్తుందేమోనని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి,జీవో ను ఉపసంహరించుకొని డాక్యుమెంట్ రైటర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు….