తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణం 6వ వార్డు కోటకట్ట వీధిలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం (PTM) 4.0 కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షుడు షేక్ మున్న, కందుకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ భాష ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా షేక్ మున్న మాట్లాడుతూ, విద్యే ప్రతి విద్యార్థి జీవితానికి బలమైన పునాదని, మంచి విద్యతోనే వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోగలడని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని, పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.అనంతరం సయ్యద్ అహ్మద్ భాష మాట్లాడుతూ, విద్య అనేది జీవితాంతం తోడుండే గొప్ప సంపద అని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి నడవడి, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం వంటి విలువలను అలవర్చుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కార్యక్రమం అనంతరం ఇద్దరు నాయకులు విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువులు, లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆర్కే మెస్ (RK Mess) యజమాని షేక్ షారూఖ్ విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టేషనరీ సామగ్రిని బహుమతులుగా పంపిణీ చేసి విద్యాభివృద్ధికి తన వంతు సహకారం అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.