ముండ్లమూరు మండలం ఉమామహేశ్వరపురం, అగ్రహారం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు దాతల సహకారంతో 35 సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతూ, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు తెలిపారు. విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ, విద్యార్థులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థినులకు అవసరమైన సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.విద్యార్థినులకు 35 సైకిళ్లను దాతలు దేవినేని కోటేశ్వరరావు, కంచుమాటి శ్రీనివాసరావు, దిరిశాల శ్రీనివాసరావు, రాజా గార్లు అందించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల పార్టీ అధ్యక్షులు సోమేపల్లి శ్రీను, మాజీ జడ్పీటీసీ కొక్కెర నాగరాజు, మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *