సింగరాయకొండ గీతం ఒలంపియాడ్ స్కూల్ విద్యార్థులకు పలు విభాగాల లో ప్రాతినిధ్యం వహించేందుకు సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్నికల మీద అవగాహన కల్పించి తమకు తమ పాఠశాలకు ప్రాతినిధ్యం వహించడం కోసం హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అసిస్టెంట్ బాయ్ పెద్దాలతో పాటు స్పోర్ట్స్ , సంస్కృతి కార్యక్రమాల కోసం ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ఎన్నికలు నిర్వహించారు. అనంతరం చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు కు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుకు నడిపించే చర్యలలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో మన ఎన్నికల విధానం తెలిపే విధంగా విద్యార్థులకు ఎలక్షన్ మీద అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ధనలక్ష్మి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *