ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు,రేపు నిర్వహించనున్న పొగాకు రైతుల ‘లే సీజ్’ పిలుపు నేపథ్యంలో ఒంగోలు డీఎస్పీ గారు మరియు దర్శి డీఎస్పీ గారు రైతు సంఘాల ప్రతినిధులు, సీపీఐ, సీపీఎం మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఒంగోలు తాలూకా, ఒంగోలు రూరల్, కొండేపి సీఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో రైతుల సమస్యలు, ప్రతిపాదిత కార్యక్రమం, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమాన్ని చట్టాలను గౌరవిస్తూ శాంతియుతంగా నిర్వహించాలని, పోలీసు శాఖకు సహకరించాలని నాయకులకు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *