కొండపి నియోజకవర్గం కామేపల్లి లో వెలసిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆలయం లో ఆషాడ మాసం మంగళవారం సందర్భంగా పోలేరమ్మ తల్లి అమ్మవారు శాకాంబరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈవో బైరాగి చౌదరి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ అమ్మవారిని కూరగాయలతో కన్నుల పండగగా అలంకరించారు. అమ్మవారి అలంకారం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ చైర్మన్ పోటు పెదబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుంచి భక్తులకు అన్నప్రసాద వినియోగం నిర్వహిస్తున్నారు.శ్రీ పోలేరమ్మ దేవస్థానం లొ జరుగుచున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమమునకు కామేపల్లి గ్రామానికి చెందిన చాగంటి వెంకట ప్రసాద్ రావు ధర్మపత్ని పద్మావతి రూ 20000/- లు విరాళముగా సమర్పించారు.వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా ఉండాలని ఆలయ చైర్మన్ పోటు పెద్దబాబు, ఆలయ ఈవో బైరాగి చౌదరి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ పెదబాబు మాట్లాడుతూ రైతుల సుభిక్షంగా ఉండి పాడిపంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ఉండాలని ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *