ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాల అరికట్టే లక్ష్యంతో అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహిస్తున్నారు.బహిరంగంగా మద్యం సేవించడం, జూదం, పేకాట నిర్వహించడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న గ్రామ శివారులు, వ్యవసాయ పొలాలు, తోటలు, నిర్మానుష్య ప్రాంతాలు, ఖాళీ స్థలాలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.డ్రోన్ నిఘా ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించి సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే సమాచారం అందజేస్తూ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మరింత భద్రత కల్పించడం, నేరాలను ముందస్తుగా నిరోధించడం మరియు శాంతిభద్రతలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించి పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *