సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు గిట్టుబాటు ధర కొనుగోలు చేయటం కోసం 1000 కోట్ల రూపాయల కేటాయించి కేజీ పొగాకు 250కి తగకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 29వ తేదీ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరుగు జాతీయ రహదారుల దిబ్బధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చాskm జిల్లా నాయకులు కామ్రేడ్ సి ఎస్ సాగర్ రైతాంగానికి పిలుపునిచ్చారు, ఇప్పటికే లోగ్రేడు పొ గాకు సరాసరి 152 రూపాయలకు కేజీ కొనుగోలు చేస్తున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం 110 రూపాయలు కేజీ లో గ్రేడు కొనుగోలు చేయాలని ఆదేశించినటువంటి పొగాకు రైతులను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టినట్లే ఉందని కామ్రేడ్ సి.ఎస్. సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, అందువలన ప్రభుత్వం ఇప్పటి కైనా పునరాలోచన చేసి కేజీ పొగాకు 250 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థలను రంగంలోకి దించి పొగాకు వ్యాపారుల సిండికేట్ ను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రైతు నాయకులు టంగుటూరు రాము,, లక్ష్మి,ప్రభాకర్, ఐయఫ్ టి యు నాయకులు కామ్రేడ్ ఆర్ మోహన్, టి,వెంకట్రావు, సిహెచ్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు