కందుకూరు మండల న్యాయ సేవ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కే జి బి వి స్కూలు నందు ” మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం”కార్య క్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కందుకూరు సివిల్ జడ్జి కే .కే .వి . బుల్లి కృష్ణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా జడ్జి గారు మాట్లాడుతూ పిల్లలను ఏవిధంగా మోసంచేస్తున్నారు, అక్రమంగా పిల్లలను రవాణా చేస్తున్నారు, ముఖ్యముగా పిల్లలు తెలుసు కోవలసిన చట్టులు గురించి అవగాహణ కల్పించారు.పిల్లలు ఎలాంటి మాయ మాటలకు లోబడ కుండా భాగా చదువుకొని భవిష్యత్తులో మంచి మార్గంలో నడవాలని అన్నారు. ఈ కార్య క్రమంలో న్యాయవాదులు పి సంపత్ కుమార్, ఎస్.కె జమీర్ ప్రిన్సిపల్ స్వాతి, కేజీబీవీ సిబ్బంది పాల్గొనటం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *