ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం, CEIR పోర్టల్ మరియు పోలీసు శాఖ ప్రత్యేక సాంకేతిక విభాగం సహకారంతో గుర్తించిన ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసు, వాటిని సంబంధిత యజమానులకు తిరిగి అప్పగించారు.మొబైల్ ఫోన్ అనేది నేటి రోజుల్లో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, విద్య, ఉద్యోగం మరియు అత్యవసర కమ్యూనికేషన్‌కు ఎంతో కీలకమైన సాధనం. అలాంటి మొబైల్ ఫోన్ పోయినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని పోలీసులు సూచించారు.ఫిర్యాదులను సాంకేతికంగా విశ్లేషించి, వివిధ ప్రాంతాల్లో గుర్తించిన మొబైల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకుని వాటి యజమానులను గుర్తించి అప్పగించడం ద్వారా పోలీసు శాఖ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తోంది.ఈ సందర్భంగా తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసు శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ, సత్వర స్పందన, సాంకేతికత ఆధారిత పోలీసింగ్ మరియు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ప్రకాశం జిల్లా పోలీసు మరియు మార్కాపురం జిల్లా పోలీసు ఎల్లప్పుడూ ముందుంటాయని అధికారులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *