ఆగస్టు 6న టంగుటూరు అంబేద్కర్ పార్కులో నిర్వహించనున్న చుండూరు మృతవీరులు, కామ్రేడ్ గద్దర్ అన్న సంస్మరణ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు టంగుటూరు బస్టాండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద, జమ్ములపాలెం అంబేద్కర్ నగర్‌లో సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. చుండూరు ఘటనలో అమరులైన మృతవీరులను స్మరించుకోవడంతో పాటు సామాజిక న్యాయం కోసం పోరాడిన కామ్రేడ్ గద్దర్‌కు నివాళులర్పించే కార్యక్రమంగా సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి VCK రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జే. విద్యాసాగర్, జిల్లా అధ్యక్షులు ఆదినారాయణతో పాటు దళిత, ప్రజాస్వామిక సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తుల్లిబిల్లి అశోక్ బాబు, ఆదినారాయణ, ఏపూరి క్రాంతికుమార్, కార్తీక్, కే. రాజు, పంతగాని శ్రీను, నివాస్, శ్రీధర్, అవినాష్, హేమంత్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *